TODAY SPECIAL - మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు......

మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు......


మహిళలు, చిన్నారులపై అత్యాచార కేసుల్లో వేగవంతమైన విచారణకోసం దేశవ్యాప్తంగా 1,023 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

మొత్తం పెండింగ్ లో ఉన్న కేసులు--  1.66 లక్షలు

ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులుపరిష్కరించేబోయే  కేసుల సంఖ్య- ఏడాదికి కనీసం 165 కేసులు.

389 కోర్టులు--లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద నమోదైన కేసులను ప్రత్యేకంగా విచారిస్తాయి.

634 కోర్టులు--అత్యాచార కేసులు లేదా అత్యాచార మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ కేసులను  విచారిస్తాయి.

బడ్జెట్‌--రూ. 767.25 కోట్లు.కేంద్ర ప్రభుత్వం రూ.474  కోట్లు  నిర్భయ ఫండ్ నుండి అందిస్తుంది. ఈ నిర్భయ ఫండ్ 2013లో ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ కోర్టులను అక్టోబర్  రెండవ తేదీ నుంచి ప్రారంభించాలని ప్రయత్నిస్తున్నారు.

పోక్సో చట్టం,2012----‘లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ (పోక్సో) (సవరణ) బిల్లు–2019’ చిన్నారులపై లైంగిక దాడులకు సంబంధించి అత్యంత అరుదైన కేసుల్లో దోషులకు మరణ శిక్ష విధించేందుకు సవరణ.‘చిన్నారులతో నీలి చిత్రాలు’ (చైల్డ్‌ పోర్నోగ్రఫీ)కి ఈ బిల్లులో నిర్వచనం కూడా చేర్చి, మరిన్ని ఎక్కువ దుశ్చర్యలను నేరం కిందకు వచ్చేలా చేశారు.

సుప్రీం కోర్ట్ --లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించే చట్టం(పోక్సో) కింద 100కి పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన జిల్లాల్లో, పూర్తిగా కేంద్ర నిధులతో 60 రోజుల్లోపు ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
*. మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి--స్మృతీ ఇరానీ